Glock in my purse lil uzi vert lyrics

మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా, చంపడానికా
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే.. గుండెలోని నా కసివే
చేపకల్ల రూపసివే… చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే… సరసకు చెలి చెలి రా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కల్లారా
నిన్నే తలచి తలచి ఇలా, ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కల్లారా
నిన్నే తలచి తలచి ఇలా, ఉన్నాగా
నువ్వే ఎద సడివే
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా, చంపడానికా
చిన్నాదానా.. ఓసి! అందాల మైనా
మాయగా మనసు జారి పడిపోయెనే
తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే
నీ లాగే కులికెనే నిను చేరగా
ఎన్నాలైనా అవి ఎన్నేళ్లు అయినా
వందేళ్లు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా
గండాలైనా సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా, ఓ ప్రేమా
మనం కలిసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగనీ హంగామా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా
అయ్యో రామ… ఒసి వయ్యారి భామ
నీవొక మరపురాని మృదుభావమే
కిలకిల నీ నవ్వు తలుకులే
నీ కల్ల మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో
ఏం చేస్తున్నా… నేను ఏ చోట ఉన్నా
చూస్తూనే ఉన్నా… కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి.. .నిన్ను అందులో దాచి పూజించనా
రక్త మందారాలతో కాలాన్నే
మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా
ఎల్లా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా..??
Comments
Post a Comment